Friday, May 3, 2024

దళితబంధు రద్దు.. వాటర్ ట్యాంక్‌ ఎక్కి నిరసనలు

spot_img

పేదల ప్రభుత్వం బీఆర్ఎస్ లేనిలోటు కనిపిస్తుందంటున్నారు జనాలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలన్నరకే ప్రజలకు తత్త్వం బోధపడింది. దేశంలోనే అత్యధిక పథకాలని ప్రవేశపెట్టి ఇంటికో పథకం అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ ది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ ఇచ్చిన 420హామీలు ఇవ్వకుండా టైం పాస్ చేస్తుంది. దీనికి తోడు మునుపటి పథకాలని వరుసగా ఆపేస్తున్నారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతున్నది.

అయితే తాజాగా బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ఆపొద్దని.. అలానే కొనసాగిస్తూ దళితబంధు నిధులను విడుదల చేయాలనీ లబ్ధిదారులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంలో తక్షణమే దళితబంధు నిధులు రిలీజ్ చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టరేట్లో ఉన్న వాటర్ ట్యాంక్‌ను ఎక్కి దళిత బంధు లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. మంత్రి సీతక్క, కలెక్టర్ పట్టించుకోని సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దళితుల అభ్యుదయానికి తోడ్పాటు అందించే దళితబంధు రద్దు చేస్తే ఊరుకోమని సీరియస్ అయ్యారు. దీంతో కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.

Latest News

More Articles