Monday, May 13, 2024

గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఆమెలా రెడీ అయి ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లిన లవర్ బాయ్

spot_img

ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిలు దేనికైనా తెగిస్తుంటారు. ఆ విధంగానే ఇక్కడో అబ్బాయి తన లవర్ కోసం అమ్మాయిగా రెడీ అయ్యి పరీక్ష రాసేందుకు వెళ్లాడు. చివరకు బయోమెట్రిక్‌ దగ్గర దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. పంజాబ్‌‎లోని ఫరీద్‌కోట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also: ఆర్టీసీకి ఒక్క రోజే రూ. 12 కోట్ల ఆదాయం

పంజాబ్‌లోని బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెన్స్‌.. జనవరి 7న మల్టిపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ పరీక్ష నిర్వహించింది. దీనికి పరమ్‌జీత్‌ కౌర్‌ అనే యువతి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆమె స్థానంలో పరీక్ష రాసేందుకు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అంగ్రేజ్‌ సింగ్‌ వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అమ్మాయిలాగా డ్రెస్‌, బొట్టు, గాజులు, లిప్‌స్టిక్‌ పెట్టుకుని అచ్చం ఆమెలా రెడీ అయ్యాడు. అంతేనా.. తానే పరమ్‌జీత్‌ అని నమ్మించేందుకు ఆడవేషంలో తన ఫొటోలతో నకిలీ ఓటర్‌కార్డు, ఆధార్‌ కార్డు సృష్టించాడు. కానీ, చివరకు బయోమెట్రిక్‌ దగ్గర దొరికిపోయాడు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో అవి మ్యాచ్‌ కాకపోవడంతో అనుమానం వచ్చిన యూనివర్సిటీ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పరీక్ష రాసేందుకు వచ్చిన వ్యక్తి అబ్బాయి అని తెలిసి అందరూ అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. అతడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles