Saturday, June 22, 2024

వయనాడ్‌ను వదులుకోనున్న రాహుల్ గాంధీ

spot_img

జరిగిన లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే రాహుల్ గాంధీ రెండో సీటును వదులుకోనున్నట్లుగా సమాచారం. యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించడం కోసం రాయ్ బరేలీ సీటును అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నారు. వయనాడ్ నుంచి రెండోసారి గెలిపించినందుకు ఈ సీట్లోనే కొనసాగాలని కేరళ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే యూపీపై దృష్టి సారించాల్సి ఉందన్న  పార్టీ అధిష్టానం సూచనలతో కేరళ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ తర్వాత అందుకు అంగీకరించారని తెలుస్తోంది.

ఇవాళ(శ‌నివారం) జ‌రిగిన సీడబ్ల్యుసీ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లుగా చెబుతున్నారు. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించిన త‌ర్వాత మాత్రమే ఫైనల్ నిర్ణయం తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, రాహుల్ గాంధీ వయనాడ్ ను వదులుకుంటే…అక్కడి నుంచి ప్రియాంకా గాంధీని పోటీ చేయించాలన్న విజ్ఞప్తిని కూడా గాంధీ కుటుంబం తిరస్కరించిందని చెబుతున్నారు. కేరళకు చెందిన సీనియర్ నేతను ఇక్కడి నుంచి పోటీలోకి దించాలని భావిస్తున్నారు పార్టీ పెద్దలు.

ఇది కూడా చదవండి:నీట్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ జ‌రిపించండి

 

Latest News

More Articles