Friday, May 3, 2024

హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం.. నాలుగు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు

spot_img

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు నాలుగు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఇవాళ్టి( గురువారం) నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 36-26 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని చెప్పింది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. వడగాలులతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం నుంచి నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉండగా.. చల్లటి గాలులు వీస్తుండడంతో నగరవాసులకు ఊరట కలిగించినట్లయ్యింది.

ఇది కూడా చదవండి: ఆ ఎమ్మెల్యేలకు డిపాజిట్‌ రాకుండా చేస్తాం

Latest News

More Articles