Sunday, May 12, 2024

ఎర్రవల్లిలోముగిసిన రాజశ్యామల యాగం

spot_img

సిద్దిపేట : ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం  ముగిసింది. మూడు రోజులపాటు సాగిన యాగం శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో క్రతువుతో పూర్తయింది.  మహా పూర్ణాహుతి అనంతరం యాగంలో మంత్రించిన జలాలను కేసీఆర్‌ దంపతులపై చల్లారు. యాగ భస్మాన్ని కేసీఆర్‌ నుదుట దిద్దారు.

Also Read.. నాగర్ కర్నూల్ లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్!

ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని సీఎం కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహించారని తెలిపారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందన్నారు.  ఈ మహా పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. యాగం అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి పాదపూజ చేసి కేసీఆర్‌ పుష్పాభిషేకంతో గురు వందనం సమర్పించారు.

Latest News

More Articles