Sunday, April 28, 2024

సినీ నటుడు జేడీ చక్రవర్తికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు

spot_img

విలక్షణమైన పాత్రలను పోషిస్తూ సినీ నటుడు జేడీ చక్రవర్తి ప్రత్యేక గుర్తింపును పొందారు. కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా జేడీ నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ విజయం సాధించింది. ఈ సిరీస్ లో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ లోని నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఓటీటీ ప్లే అనే సంస్థ ఈ అవార్డును అందించింది. దేశ వ్యాప్తంగా ఓటీటీ కంటెంట్ లో ఈ అవార్డులను ఇచ్చింది. దయా వెబ్ సిరీస్ కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి, ఉత్తమ దర్శకుడిగా పవన్ సాధినేని అవార్డులకు ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి: మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్

 

Latest News

More Articles