Saturday, June 22, 2024

ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు

spot_img

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) ఇవాళ(శనివారం) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం  రామోజీ పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు.

రామోజీరావు అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు(ఆదివారం) వస్తున్నాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి:నీట్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ జ‌రిపించండి

Latest News

More Articles