Friday, May 17, 2024

పాలమూరు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నా

spot_img

తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని తెంచుకుని బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. రావులను కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిన తర్వాత మాట్లాడిన రావుల చంద్రశేఖర్ రెడ్డి… పాలమూరు  అభివృద్ధి కోసం, ప్రజా సేవ కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నా. ఏ పదవిని ఆశించడం లేదు. కేసీఆర్ రెండు టర్ముల్లో అభివృద్ధి బాగా జరిగింది. కేసీఆర్ కు మరోసారి అవకాశ మిస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రి కేటీఆర్ దూర దృష్టి గల నేత అని..బీఆర్ఎస్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు రావుల.

టీడీపీ తరపున రావుల చంద్రశేఖర్ రెడ్డి 1994, 2009 ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విప్ గా పని చేశారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ నాయ‌క‌త్వ‌మే రాష్ట్రానికి శ్రీరామ ర‌క్ష

Latest News

More Articles