Friday, May 17, 2024

పేటీఎంకు ఆర్బీఐ బిగ్ రిలీఫ్..మార్చి 15 వరకు నిషేధం సడలింపు..!!

spot_img

పేటీఎంకు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త ఉపశమనం కలిగించింది. కస్టమర్ ఖాతాలపై టాపప్ లేదా క్రెడిట్ లావాదేవీలు , డిపాజిట్ల సేకరణ, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాల నిర్వహణ నిలిపివేత గడువును ఆర్బీఐ పొగిస్తున్నట్లు ప్రకటించింది. మర్చంట్లతో కస్టమర్ల ప్రయోజనాలను పరిగణలోనికి తీసుకుని 15రోజుల గడువు పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది.

ఈనెల 29 తర్వాత ఖాతాదారుల నుంచి డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ లావాదేవీలు, టాపప్ రుణాలు ప్రీపెయిడ్ ఇన్స్ట్రమెంట్స్, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాలు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల లావాదేవీలు నిర్వహించకూడదని ఇంతకుముందు గతనెల 31న పీపీబీఎల్ ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రజల ప్రయోజనాల ద్రుష్ట్య మర్చంట్లతోపాటు ఖాతాదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు పేటీఎం మరికొంత సమయం కేటాయించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. పీపీబీఎల్ వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు విత్ డ్రా చేసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

పేటీఎం వాలెట్లు, పేమెంట్స్ ద్వారా రూ. కోట్లలో మోసపూరిత లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి ఆడిటర్లు ఇచ్చిన ఆడిట్ రిపోర్టు ఆధారంగా పేటీఎం అనుబంధ పీపీబీఎల్ పై చర్యలు తీసుకుంది. పీపీబీఎల్ లో పర్యవేక్షణా లోపాలు ఉన్నాయని తేలడంతోనే దానిపై మరింత రెగ్యులేటరీ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది.

ఇది కూడా చదవండి: సోనియాగాంధీ ఇంటి విలువ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.!!

Latest News

More Articles