Sunday, June 16, 2024

రేపటి నుంచి రోహిణి కార్తె షురూ..రోకల్లు పగిలే ఎండలు తప్పవా?

spot_img

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇదే నక్షత్రంలో జూన్ 8వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. ఈ పక్షం రోజుల పాటు మరింత ఎక్కువగా ఉంటాయి. నాలుగు నెలలుగా వచ్చే వేడిగాలులు ఒక్క ఎత్తైతే కేవలం రోహిణి కార్తె సమయంలో మాత్రం నేరుగా రోళ్లు రోకళ్లు పగిలేంత ఎండలు పెరిగిపోతాయి. ఈ కాలంలో సూర్య భగవానుడు మండిపోతుంటాడు. ఈ పక్షం రోజుల్లో సూర్యుడి తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుని కొద్ది కొద్దిగా తగుత్తుంది. ఈ సందర్భంగా రోహిణి కార్తె అంటే ఏమిటీ..ఈ కాలంలో సూర్యభగవానుడు ఎందుకంత తన ప్రతాపాన్ని చూపిస్తాడో తెలుసుకుందాం.

రోహిణి కార్తె అంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు, గ్రహాలను బట్టి పంచాంగాన్ని రూపొందిస్తారు పండితులు. జాతకాలను తయారు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సూర్యోదయం కాలానికి ఏ నక్షత్రం దగ్గరగా ఉంటే ఆ రోజు ఆ నక్షత్రం పేరు పెట్టారు. అదే విధంగా పౌర్ణమినాడు చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరుకు పెట్టారు. తెలుగువారు మాత్రం ఇవే నక్షత్రాలలో వ్యవసాయ పంచాంగాన్ని రూపొందించుకున్నారు. ఈనక్షత్రాలను కార్తెలు అని పిలుస్తుంటారు. ఈ లెక్కన సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు. ఏడాదికి 27 కార్తెలు ఉంటాయి. ఈ కార్తెలను అందరికీ అర్థమయ్యే విధంగా సామెతల రూపంలో రూపొందించారు అందులో ఒకటి రోహిణి కార్తె.

రోకళ్లు పగిలేంత ఎండలు:
తెలుగు పంచాంగం ప్రకారం ఉగాది పండగ నుంచి సూర్యుడి ప్రతాపం పెరుగుతుంది. రోజురోజుకు ఎండలు పెరుగుతుంటాయి. చివరికి రోహిణి కార్తె సమయంలో సూర్యుడు తన ప్రభావాన్ని గరిష్టస్థాయికి తీసుకెళ్తాడు. అందుకే ఈ కార్తెలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ కార్తె కాలంలో రోళ్లు పగులుతాయని చెబుతుంటారు. అంటే దీన్ని బట్టి సూర్యుడి ప్రతాపం ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ టూ కాశీ.. IRCTC స్పెషల్​ టూర్..పూర్తి వివరాలివే.!

 

Latest News

More Articles