Sunday, May 19, 2024

కొత్త కోడ్ తో ఆర్టీఏ కాసుల వర్షం.!

spot_img

వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో తెలంగాణలో రవాణాశాఖు కాసుల వర్షం కురిపిస్తోంది. కోడ్ ప్రారంభమైన మొదటిరోజే గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో భారీగా ఆదాయం వచ్చి చేరింది. ఫీజు, ఫ్యాన్సీ నెంబర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2.51కోట్ల ఆదాయం వచ్చింది. అందులో రూ. 1.32కోట్లు మూడు జిల్లాల నుంచే సమకూరింది. అన్ని కార్యాలయాల్లో టీజీతోపాటు 0001 కొత్త సీరిస్ ప్రారంభం అయ్యింది. ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపించారు వాహనదారులు. ఆన్ లైన్లో పోటాపోటీగా బిడ్డింగ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో టీజీ 09 0001 నెంబర్ కు ఏకంగా రూ. 9,61,111ధర పలికింది. రాజీవ్ కుమార్ ఆన్ లైన్ బిడ్డింగ్ లో ఈ ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్నారు. ఇన ముందు కూడా ఇంకా ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ ఉంటుందని ఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు.

ఖైరతాబాద్, టోలిచౌకి, మలక్ పేట్, తిరుమలగిరి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, కూకట్ పల్లి, మేడ్చల్, బండ్లగూడలో కొత్త కోడ్ తో అధికారులు రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఫ్యాన్సీ సిరీస్ నెంబర్ల కోసం అధికారులు ఆన్ లైన్ లో బిడ్డింగ్ నిర్వహించారు. దీంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. 0009,0999 వంటి నెంబర్లను పోటీపడి మరి దక్కించుకున్నారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు మాత్రం పాత టీఎస్ కోడ్ తోనే రిజిస్ట్రేషన్లను చేశారు. మరో 15రోజుల వరకు పాత స్లాట్లు నడుస్తాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసినవారికి మాత్రం టీజీ కోడ్ తో సిరీస్ కేటాయిస్తున్నారు. పాత విధానం ప్రకారమే నెంబర్లకు నిర్ణీత ఫీజు ఉంటుందని హైదరాబాద్ జేటీసీ రమేశ్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు నక్సలైట్లు మృతి.!

Latest News

More Articles