Friday, May 17, 2024

ఎంఎడ్, ఎంపీఎడ్ కోర్సుల్లో ఎంట్రెన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌

spot_img

ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని ఆయా కాలేజీల్లో ఎంఎడ్, ఎంపీఎడ్ ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే కౌన్సెలింగ్ షెడ్యూల్ సీపీ గెట్ నిర్వాహ‌కులు విడుద‌ల చేశారు. MEd , MP Ed ప్ర‌వేశ ప‌రీక్షలో ఉత్తీర్ణులైన అభ్య‌ర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఆ తర్వాత స‌ర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

9వ తేదీ నుంచి 11వ తేదీ లోపు వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవాలి. 11వ తేదీన వెబ్ ఆప్ష‌న్ల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 15న ప్రొవిజిన‌ల్ అలాంట్‌మెంట్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ రెండు కోర్సుల్లో సీట్లు పొందిన అభ్య‌ర్థులు 18వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. రిపోర్టు చేయక పోతే సీటు ర‌ద్దవుతుంది.

ఇది కూడా చదవండి: మీరు అండగా నిలవండి.. మీకు అండగా నేను ఉంటా

Latest News

More Articles