Friday, May 17, 2024

10 సీట్లు వచ్చినప్పుడే భయపడలే.. ఇప్పుడైతే ఒక్కొక్కడిని వణికిస్తాం

spot_img

కృష్ణా నది కింద ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకి కాంగ్రెస్, బీజేపీలు అన్యాయంగా అప్పగించాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రాజెక్టుల నియంత్రణను బోర్డుకు అప్పగించడాన్ని ఆయన అంగీకరించలేదని, తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. శనివారం సిద్ధిపేట పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, అందుకు సంబంధించిన మినిట్స్‌ను కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. కృష్ణా జలాల్లో వాటాను బోర్డుకు అప్పగించే అధికారం రాష్ట్రానికి ఉందని, ప్రాజెక్టులపై తెలంగాణ అధికారుల నియంత్రణ ఉండాలని వాదించారు.

ఇక కాంగ్రెస్ కి బీఆర్ఎస్ భయపడుతోందని వస్తున్న కామెంట్స్ పై హరీష్ రావు స్పందిస్తూ.. మనకు 10 సీట్లు వచ్చినప్పుడు కూడా వెనకడుగు వేయలేదని… బీఆర్ఎస్ ముళ్ల బాట… పూలబాట రెండింటినీ చూసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఓ గార్డెన్‌లో ఈ రోజు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో మనం అధికారం కోల్పోయామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి గెలిచిందని ఆరోపించారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, దాడులు, బెదిరింపులు కొత్త కాదన్నారు.

Latest News

More Articles