Tuesday, May 21, 2024

లిబియా ప్రధాని ఇంటిపై రాకెట్ గ్రనేడ్ దాడి. !

spot_img

లిబియా ప్రధాని నివాసంపై ఆదివారం గ్రనేడ్ దాడి జరిగింది. ఈఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఓ మంత్రి వెల్లడించారు. ప్రధాని నివాస భవనం స్పల్పంగా ధ్వంసమైనట్లు తెలిపారు. ప్రధాని ఇంటికి సమీపంలో పెద్ద పేలుడు శబ్ధాలు వినిపించినట్లు పౌరులు చెప్పారు. వెంటనే పెద్దెత్తున బలగాలను మోహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

2011 నుంచి లిబియాలో శాంతిభద్రతల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పాలనపై పట్టుకోసం 2014లో తూర్పు, పశ్చిమ కింద వైరి వర్గాలు ఏర్పడి ఎవరికి వారు సొంతంగా పాలనను కొనసాగిస్తున్నాయి. 2021లో అబ్దుల్ హమీద్ అల్ దబేబా ఆధ్వర్యంలోని నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. కానీ ఆ ఏడాది చివరికి తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ దీన్ని అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించింది. జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడమే దీనికి కారణం. దీంతో అప్పటి నుంచి లిబియాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 600పోస్టులకు రిక్రూట్ మెంట్..పూర్తి వివరాలివే.!

Latest News

More Articles