Friday, May 17, 2024

ఆశ‌యానికి, అహంకారానికి మ‌ధ్య జ‌ర‌గుతున్న యుద్ధం ఇది

spot_img

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, తెలంగాణ ద్రోహుల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఇవి అని బీఆర్ఎస్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. క‌రీంన‌గ‌ర్ స్మార్ట్ సిటీ కావాలి.. ప్ర‌పంచ పటంలో క‌నిపించాల‌ని గుండెల నిండా ప్రేమ ఉన్న వినోద్ కుమార్‌కు, గుట్కా పాకెట్లకు మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం ఇది అని ఆయ‌న తెలిపారు. క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ ప‌రిధిలో నిర్వ‌హించిన క‌రీంన‌గ‌ర్ యుద్ధ‌భేరీ స‌భ‌లో ఆర్ఎస్పీ పాల్గొని మాట్లాడారు.

రేవంత్ ఆదేశాలతో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై పోలీసులు కేసులు పెడుతున్నారు. కేసుల‌కు భ‌య‌ప‌డ‌కుండా.. పోరాటం చేయాలి. వినోద్‌కుమార్‌ను పార్ల‌మెంట్‌కు పంపించేంత వ‌ర‌కు నిద్ర పోవ‌ద్దు. మ‌నం ఇవాళ ఆత్మ‌గౌర‌వంతో ఉన్నామంటే ఎంతో మంది మ‌హ‌నీయుల త్యాగం ఉంది అని ఆర్ఎస్పీ తెలిపారు. అంతేకాదు… వినోద్ కుమార్‌, బండి సంజ‌య్ మ‌ధ్య పోరాటం కాదు.. ఇది కేసీఆర్, రేవంత్ రెడ్డి మ‌ధ్య పోరాటం కాదు.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, తెలంగాణ ద్రోహుల‌కు మ‌ద్య జ‌రుగుతున్న యుద్ధం ఇది. ఇవాళ తెలంగాణ‌లో యుద్ధం జ‌రుగుతున్న‌ది. తెలంగాణ వ్యాప్తంగా యుద్ధ మేఘాలు క‌మ్ముకుని ఉన్నాయి. ప‌దేండ్ల నిజ‌మైన పాల‌న‌కు, 100 రోజుల అబ‌ద్దానికి మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న‌ది. రైతుల క‌ష్టాలు తెలుసుకునేందుకు మండుటెండ‌ల్లో కేసీఆర్ తిరుగుతుంటే.. ఎవ‌ర‌న్న ఎక్క‌డ‌న్న చావ‌నని చెప్పి… ఉప్ప‌ల్ స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న రేవంత్ రెడ్డి మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం ఇది అని ఆర్ఎస్పీ చెప్పారు.

తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌యానికి, కాంగ్రెస్ నాయ‌కుల అహంకారానికి మ‌ధ్య జ‌ర‌గుతున్న యుద్ధం ఇది. 200 మంది రైతులు చ‌నిపోయార‌ని చెప్పిన‌ప్పుడు.. తెలివైన సీఎం అయితే వివ‌రాలు సేక‌రించి, వారి ద‌గ్గ‌ర‌కు వెళ్తారు. రైతుల‌ను కాపాడుకుంటామ‌ని హామీ కూడా ఇస్తారు. కానీ అహంకారం ఏంటంటే.. మీ ద‌గ్గ‌ర లిస్ట్ ఉంటే ఇవ్వండి. వెరిఫై చేస్తాం అని అహంకారంతో అంటున్నారు. కాబ‌ట్టి అహంకారానికి కాకుండా ఆశ‌యానికి ఓటు వేయాల‌ని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు.

ద‌య‌చేసి గులాబీ శ్రేణులంతా సైనికులుగా మారి ఊరూరా పోవాలి.. ఇది మ‌న భ‌విష్య‌త్ బ‌తుకు పోరాటం. ఇది మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్, రైతుల‌ క‌న్నీళ్లు తుడిచే పోరాటం.. ఇది మ‌న రాజ్యాంగాన్ని ర‌క్షించుకునే పోరాటం. బండి సంజ‌య్ గెలిస్తే.. బీజేపీకి మెజార్టీ వ‌స్తే.. మోడీ, అమిత్ షా మ‌నుస్మృతి ఆధారంగా త‌యారు చేసుకున్న‌ రాజ్యాంగాన్ని పార్ల‌మెంట్‌లో ఆమోదిస్తారు.. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఓటు వేసి రాజ్యాంగాన్ని ర‌క్షించుకోవాల‌ని ఆర్ఎస్పీ సూచించారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్ల ఖ‌ర్చు

Latest News

More Articles