Friday, May 17, 2024

రూ. లక్షలోపు ఉన్న బెస్ట్ మైలేజ్ బైక్స్ ఇవే..!!

spot_img

మీరు కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ కేవలం లక్ష రూపాయల లోపే ఉందా? అయితే మీకోసం ఈరోజు 5 బైకులను పరిచయం చేస్తున్నాం. మైలేజీ, ధర పరంగా ఈ బైక్స్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ నుంచి బజాజ్ ప్లాటీనా 110 వరకు ఉన్నాయి.

హీరో HF డీలక్స్:
ఈ బైక్ పవర్, స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే, ఇందులో 97.2 సిసి ఇంజన్ ఉంది. ఇది 8000 Rpm వద్ద 7.94 Bhp శక్తిని, 6000 Rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉపయోగించారు. దీని ప్రారంభ ధర రూ.65,938.

TVS స్పోర్ట్:
ఈ మోటార్‌సైకిల్‌లో BS6 ఇంజన్‌ని ఉపయోగించారు. ఇందులో 109.7 సిసి సింగిల్ సిలిండర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 8.29PS పవర్, 8.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది నాలుగు-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో వస్తుంది. ఈ బైక్ ధర రూ.64,050 ఎక్స్-షోరూమ్. అయితే దీని టాప్ స్పీడ్ ధర రూ.68,093.

బజాజ్ ప్లాటినా 100:
ఇండియన్ మార్కెట్లో ఈ మోటార్ సైకిల్ ధర రూ.64,653. ఇందులో 102సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ మోటార్ ఉంది. ఇది 7,500 rpm వద్ద 7.77 bhp శక్తిని, 5,500 rpm వద్ద 8.34 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేసి వస్తుంది. ఇది 96.9 kmpl మైలేజీని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ.

బజాజ్ CT 110X:
ఈ మోటార్‌సైకిల్‌లో 115 సీసీ ఇంజన్‌ని ఉపయోగించారు. ఇది 7,500 rpm వద్ద 8 bhp శక్తిని, 5,000 rpm వద్ద 10 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉపయోగించారు. దీని ధర రూ.67,322 ఎక్స్-షోరూమ్.

బజాజ్ ప్లాటినా 110:
ఈ బైక్‌లో 115.45సీసీ 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 7000 Rpm వద్ద 8.48 Hp శక్తిని, 5000 Rpm వద్ద 9.81 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ వస్తుంది. దీని ధర రూ.69,216 ఎక్స్-షోరూమ్.

Latest News

More Articles