Saturday, May 18, 2024

ప్రిగోజిన్‌ మరణంపై రష్యా క్లారిటీ..!

spot_img

వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి యెవ్‌గెని ప్రిగోజిన్‌ మరణంలో తమ ప్రమేయం లేదని రష్యా క్లారిటీ ఇచ్చింది. వాగ్నర్‌ చీఫ్‌ను తామే హత్య చేయించామంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధమని చెప్పింది. ప్రిగోజిన్‌ను తాము హత్య చేయించలేదని స్పష్టం చేసింది. పశ్చిమ దేశాల రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది.

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా ప్రిగోజిన్‌ ఆధ్వర్యంలో వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ సైన్యం పోరాడుతోంది. రెండు నెలల క్రితం ఆయన రష్యాపై తిరుగుబాటు చేయడం కలకలం రేపింది. దీనిని మనసులో పెట్టుకుని రష్యా అధ్యక్షుడు పుతినే ప్రిగోజిన్‌ను హత్య చేయించాడని పశ్చిమ దేశాల అధినేతలు ఆరోపిస్తున్నారు.

Latest News

More Articles