Friday, May 17, 2024

రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌.. కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతన్నాయా ?

spot_img

రైతుబంధు పథకం డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రక్రియను ప్రారంభించి ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలోని రైతులకు నయాపైసా కూడా రైతుబంధు నిధులు పడలేదు. డిసెంబర్ 9వ తారీఖున ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి 20వ తారీఖున కూడా కాంగ్రెస్ రైతుబంధు డబ్బులు వేయలేదు.

అరెకరం, ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే రైతుబంధు డబ్బులను జమ చేసినట్లు గణాంకాలు చెపుతున్నా.. అవికూడా అందరికి పడలేదని విమర్శలు వస్తున్నాయి. యాసంగి సీజన్‌ ఆరంభమై నెల రోజులు దాటినా రైతుబంధు డబ్బులు అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు.

అయితే అప్పట్లోనే కేసీఆర్ కాంగ్రెస్ చేయబోయే మోసాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. కాంగ్రెస్ కి ఓటేస్తే రైతుబంధుకి రాంరాం, దళితబంధుకి జైభీమ్ అంటారని కేసీఆర్ హెచ్చరించారు. అయినా కాంగ్రెస్ కి ఓటేసిన రైతులని కాంగ్రెస్ నట్టేటా ముంచే పాలనా చేస్తుంది. దీంతో పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌ చెబుతుందని.. కరెంటు కాటగలుస్తుంది జాగ్రత్త అంటూ రైతులు, ప్రజలను సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ప్రస్తుతం కేసీఆర్ చెప్పిన మాటలే నిజమయ్యాయని కాంగ్రెస్ కి ఓటేసిన ప్రజలు విస్తుపోతున్నారు.

 

Latest News

More Articles