Friday, May 3, 2024

‘క్లియర్ స్కిన్’ ఆరోపణలపై స్పందించిన సమంత

spot_img

ముంబయి: మయోసిటిస్‌తో బాధపడుతున్న సమంత సినిమాలకు దూరంగా ఉండి చికిత్స తీసుకుంది. చికిత్స కోసం తీసుకున్న “స్టెరాయిడ్ షాట్‌ల” కారణంగా తన చర్మం జీవాన్ని కోల్పోయిందని, పిగ్మెంటేషన్ సమస్య అధికం అయిందని సమంత స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ‘క్లియర్ స్కిన్’ విషయంపై స్పందించింది. చికిత్స కోసం తీసుకున్న స్టెరాయిడ్స్ కారణంగా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉందని, అందుకే ఫిల్టర్ ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. చిన్మయి శ్రీపాద తన చర్మ సౌందర్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Also Read.. తెలంగాణ పుట్టుకనే అవమానించిన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో ఏం పని?

మరొక అభిమాని  “మీరు జీవితంలో ధైర్యంగా ఉండేందుకు పాటించే టాప్ 3 విషయాలు ఏమిటి? అని అడగగా.. “నేను చాలా ఓపికగా, బలంగా ఉన్నాను. నా సంకల్ప శక్తి బాగా పెరిగింది”. అని పేర్కొంది. తాను జీవితంలో  1. నేను అధిగమిస్తాను అనే నమ్మకంతో ఉండటం, 2. విషయాలను ప్రశ్నించడం మానేయడం, 3. నిజాయితీ మరియు సత్యంతో ముందుకు సాగడం లాంటి మూడు విషయాలను పాటిస్తానని తెలిపారు.

Also Read.. బుద్ధుడి కాలం నాటి నుండి తెలంగాణలో బుద్ధిజం

ఇటీవల సమంత విజయదేవరకొండతో నటించిన కుషి సినిమా మంచి పేరు తెచ్చుకుంది. వరుణ్ ధావన్ మరియు సికిందర్ ఖేర్ కూడా నటించిన ‘సిటాడెల్’ హిందీ వెబ్ సిరీస్ లో సమంత కనిపించనుంది.

More News..

మహిళా బిల్లుపై తమన్నా రియాక్షన్

Latest News

More Articles