Friday, May 17, 2024

పాలేరు నుంచి షర్మిల పోటీ డౌటే..?

spot_img

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన వైఎస్సార్టీపీ అధినేత షర్మిలకు షాక్ తగిలింది. వైఎస్సార్ కుటుంబానికి విధేయుడు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు రాజీనామాతో ఆమె అక్కడినుంచి పోటీ చేయడం అటుంచి, తెలంగాణలో ఆమె పార్టీ మనుగడ కూడా అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల ఆమె వ్యవహార శైలి కూడా పలు అనుమానాలను లేవనెత్తడంతో.. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ తో పాటు పలువురు జిల్లా నేతలు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు.  ఇదే క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేతలు పలువురు ఆ పార్టీ నేతలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ పేరిట షర్మిల వెంటే షాడోలా ఉండే సతీష్ అనే వ్యక్తి లక్షలు వసూలు చేసినట్లు స్వయంగా ఆ పార్టీ నేతలే బాహాటంగా ప్రకటించడంతో పార్టీ అవినీతి వ్యవహారాలు బయటికొచ్చాయి.

వైఎస్సీర్టీపీ ఏర్పాటు చేయగానే ఎంతోమంది చేరుతారని భావించిన షర్మిల.. ఆదిలోనే ఆమె ఆశలు అడియాసలే అయ్యాయి. దాంతో ఇతర పార్టీల నేతలు అక్కర్లేదని.. కొత్త లీడర్లను తామే సృష్టిస్తామని ఆమె చెప్పిన బడాయి మాటలు కూడా నీటిమూటలయ్యాయి. కొత్త లీడర్ల సంగతి దేవుడెరుగు, ఉన్నవారిని కాపాడుకోవడం కూడా షర్మిలకు కష్టంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.

Latest News

More Articles