Saturday, May 4, 2024

రెండో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా మాజీ భర్త

spot_img

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్థాన్‌ క్రికెట్ మాజీ సారథి షోయబ్ మాలిక్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడు ఆ కొత్త జంట ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సానియా మీర్జా గత కొంతకాలంగా తన భర్త షోయబ్ మాలిక్‌‌కు దూరంగా ఉంటున్నారు. విభేదాలు తలెత్తడంతో..ఈ జంట ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు. దాంతో సానియా పాకిస్థాన్‌లో కన్నా ఇండియాలోనే ఎక్కువుగా ఉంటోంది. ఇదే సమయంలో సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి భర్త షోయబ్‌తో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించింది. అటు షోయబ్ మాలిక్‌ సైతం ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి తన భార్య సానియా మీర్జా పేరును తొలగించాడు.

Read Also: చెప్పకుండా లీవ్ పెట్టిన ఉద్యోగి.. ఆబ్సెంట్ వేసిన అధికారిపై దాడి

తాజాగా సానియా మీర్జా తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ‘పెళ్లి కష్టమే.. విడాకులూ కష్టమే. మీరు కఠినంగా ఉండి, సరైన దాన్ని ఎంచుకోండి. అలాగే లావుగా ఉండటం కష్టమే.. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే. అప్పు ఉండటం కష్టం. ఆర్థిక నియమం పాటించడమూ కష్టమే. మీరు సరైన దాన్ని ఎంచుకోండి. ఇతరులతో ఎటువంటి సమాచారం లేకుండా ఉండటం కష్టమే అప్పుడే జీవితం కఠినంగా మారుతుంది’ అని పోస్ట్ చేసింది.

Latest News

More Articles