Friday, May 17, 2024

మహిళా కానిస్టేబుల్‌కు అసభ్యకర మెసేజులు.. ఎస్‌ఐ సస్పెండ్‌

spot_img

లక్నో: మహిళా కానిస్టేబుల్‌కు అసభ్యకర సందేశాలు పంపిన ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.  ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) చంద్రపాల్ సింగ్ తన పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించాడని, తన మొబైల్‌ ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపి వేధిస్తున్నాడని మహిళా కానిస్టేబుల్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

Also Read.. మధ్యాహ్న భోజనానికి స్కూల్‌ బెంచీలే కట్టెలు

వెంటనే బరేలీ ఎస్పీ ఘులే సుశీల్ చంద్రభాన్‌ స్పందించారు. దర్యాప్తు చేయాలని సంబంధిత స్టేషన్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐ చంద్రపాల్ సింగ్ మహిళా కానిస్టేబుల్‌తో అనుచితంగా ప్రవర్శించినట్లు స్టేషన్‌ హెడ్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యాన్ని అధికారులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ చంద్రపాల్ ను సస్పెండ్‌ చేస్తూ.. ఆయనపై డిపార్ట్‌మెంటల్‌ దర్యాప్తు జరపాలని ఎస్పీ ఆదేశించారు.

Latest News

More Articles