Sunday, May 12, 2024

75 ఏండ్ల తర్వాత కలుసుకున్న తోబుట్టువులు..!

spot_img

దేశ విభజన సమయంలో విడిపోయిన ఆ తోబుట్టువులు దాదాపు 75 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. దీనికి సిక్కుల పవిత్ర స్థలమైన ఖర్తార్‌పూర్‌ కారిడార్‌ వేదికైంది.

వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లో ఉంటున్న మహేందర్‌ కౌర్‌ (81), పాకిస్థాన్‌లోని ఆక్రమిత కశ్మీర్‌లో ఉంటున్న షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌(78) తోబుట్టువులు. ఇండియా-పాక్ విభజన సమయంలో వారు విడిపోయారు. కౌర్‌ తండ్రితో పంజాబ్ లో ఉండిపోగా.. ఆమె తమ్ముడు చిన్న వయసులో తప్పిపోయి పాక్ ఆక్రమిత కశ్మీర్ చేరాడు.

అనంతరం కాలంలో అజీజ్ తన వారి కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ చూసి తన వాళ్లను అజీజ్ గుర్తించాడు. దాంతో ఇన్నాళ్లకు వీరిద్దరు కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన తమ్ముడిని చూసిన కౌర్.. ఆలింగనం చేసుకొని బోరున విలపించింది. ఈ దృశ్యాలను చూసిన ఇరు కుటుంబాలు వారిపై పూలను చల్లుతూ, స్వీట్లు పంచుతూ ఆనందంగా జరుపుకున్నారు.

Latest News

More Articles