Saturday, May 11, 2024

హైదరాబాద్‌లో గృహ నిర్మాణాల జోరు

spot_img

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. 2022తో పోల్చితే 2023లో 104 శాతం వృద్ధిరేటు ఉంటుందని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ విశ్లేషణ సంస్థ అనరాక్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది.

హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇండ్ల నిర్మాణాలు, విక్రయాలపై అనరాక్‌ అధ్యయనాన్ని నిర్వహించింది. ఏడు నగరాల్లోని మొత్తం స్టాక్‌లో హైదరాబాద్‌ 4% వాటా కలిగిఉందని అనరాక్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.

ఈ ఏడాది 7 నగరాల్లో సుమారు 5.6 లక్షల ఇండ్లు డెలివరీ చేసే అవకాశం ఉందన్నారు. ఇది గతేడాదితో పోల్చితే 39% పెరుగుదల నమోదు చేయనుందని తెలిపారు. ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా ఇన్‌పుట్‌ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో సకాలంలో వాటిని పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.

Latest News

More Articles