Tuesday, May 21, 2024

రన్ వే నుంచి దూసుకొచ్చి రోడ్డు మీద వెళ్తున్న కారును ఢీకొన్న విమానం

spot_img

ఎక్కడైనా విమానం రన్ వే మీద దూసుకెళ్తుంది. కానీ, అక్కడ రన్ వే మీది నుంచి అదుపుతప్పి రోడ్డు మీదకు దూసుకొచ్చింది. అంతేనా.. రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన టెక్సాస్‌ రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇద్దరు విమానంలో ఉండగా.. ఒకరు కారులో ఉన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read Also: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని వాడుకొని కాంగ్రెస్ పరువు దక్కించుకుంది

శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టులో ఓ సింగిల్-ఇంజిన్ లాంకైర్ Iv-P ప్రాప్‌జెట్‌ విమానం రన్‌వే పై నుంచి టేకాఫ్‌ అయ్యింది. అయితే దానిని పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. విమానం రన్‌వేపై చివరి వరకు వచ్చినా.. ఆగలేదు. బుల్లి విమానం ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని ఈస్ట్‌బౌండ్ వర్జీనియా పార్క్‌వేపై వెళుతున్న కారును ఒక్కసారిగా ఢీకొట్టింది. వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని.. పైలట్‌, కారు డ్రైవర్‌ను రక్షించాయి. బుల్లి విమానం నెమ్మదిగానే కారును ఢీ కొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటల పాటు అధికారులు మూసివేశారు.

Latest News

More Articles