Sunday, May 19, 2024

బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన తెలంగాణ టీడీపీ  

spot_img

హైదరాబాద్: శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికపుడి గాంధీకి శేరిలింగంపల్లి నియోజకవర్గ తెలంగాణ టీడీపీ నాయకుల మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలోని ఆరు డివిజన్ లకు చెందిన టీటీడీపీ అధ్యక్షుల మీడియా సమావేశం నిర్వహించి గాంధీకి సపోర్ట్ చేయాలని తీర్మానించారు. అభివృద్ధి, లోకల్ గా ఉన్న పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని, గాంధీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, హఫీజ్ పేట్, ఆల్విన్ కాలనీ, డివిజన్ ల అధ్యక్షులు మాట్లాడుతూ… ఇప్పుడున్న అభ్యర్థుల్లో ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరిని ఆదరించే నాయకుడు గాంధీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి తమ మద్దతు గాంధీకే అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గాంధీ వల్లనే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతో సపోర్ట్ చేస్తున్నామని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

Latest News

More Articles