Sunday, May 12, 2024

పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్ధం కావాలి

spot_img

హైదరాబాద్: రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సూచించారు. కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు.

Also Read.. అభివృద్ధి క్రెడిట్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే

2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారందరూ ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూంలను ఖరారు చేయాలని, భద్రతాపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Also Read.. సమోసా కూడా ఇవ్వలేదు..టీ, బిస్కెట్లతో పోమన్నారు.. INDIAకూటమి మీటింగ్ పై JDU ఫైర్..!!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్‌ ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఓటరు జాబితా పక్కాగా ఉండాలని, మార్పులు, చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో పెట్టకూడదని సూచించారు.

Latest News

More Articles