Sunday, May 12, 2024

అభివృద్ధి క్రెడిట్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే

spot_img

హైదరాబాద్‌: గత ప్రభుత్వం అప్పులు చేసిందని, అదే సమయంలో అభివృద్ది కూడా చేసిందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. అసెంబ్లీలో బుధవారం గత ప్రభుత్వ ఆర్థిక అంశాల మీద కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అక్బర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి క్రెడిట్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కుతుందని తేల్చి చెప్పారు.

Also Read.. కుటుంబ పాలన కేసీఆర్ దా? రేవంత్ రెడ్డిదా?

దేశానికి, ప్రపంచానికి రాష్ట్రంపై తప్పుడు మెసేజ్‌ వెళితే అది తీరని నష్టం చేస్తుందని హెచ్చరించారు. 1956 నుంచి బడ్జెట్‌ లెక్కలు తీయడం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు.  అయినప్పటికీ 1956 నుంచి 2014 వరకు రాష్ట్ర బడ్జెట్‌ 11 లక్షల కోట్లు అయితే.. 2014 నుంచి 2023 వరకు పదేండ్లలోనే రాష్ట్ర బడ్జెట్‌ 12 లక్షల కోట్లకు చేరినట్టు శ్వేతపత్రం లెక్కలే చెబుతున్నాయని, అంటే తెలంగాణ అభివృద్ధి పథంలో ఉన్నట్లే కదా అని పేర్కొన్నారు.

Also Read.. వచ్చే ఏడాది జనవరిలో స్కూళ్లకు సెలవులే సెలవులు..ఎన్నిరోజులంటే..!!

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ రాకముందే అమలు చేయాలని అక్బరుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. ఇందులో ఎలాంటి షరతులు, పరిమితులు పెట్టకుండా అందరికీ అమలు చేయాలని అన్నారు. శ్వేతపత్రంలో అన్నీ తప్పులే. ఒకే రకమైన లెక్కలు ఒక్కో పేజీలో ఒక్కో రకంగా ఉన్నాయని విమర్శించారు. రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయొద్దని, శ్వే తపత్రం ఉద్దేశమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Also Read.. నిద్రిస్తున్న ఈ 7 ప్రాణులను పొరపాటున కూడా లేపకండి..లేపితే మీరు ప్రమాదంలో పడతారు..!!

ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఇంకా 1.11 లక్షల కోట్లు రావాల్సి ఉన్నదని, ఈ విషయం శ్వేతపత్రంలో ఎక్కడ వెతికినా దొరకలేదని చెప్పారు. శ్వేతపత్రంలో లెక్కలు తప్పని తేలితే.. ఈ లెక్కలు అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయొద్దని అక్బరుద్దీన్‌ సూచించారు.

 

Latest News

More Articles