Monday, May 20, 2024

కుటుంబ పాలన కేసీఆర్ దా? రేవంత్ రెడ్డిదా?

spot_img

హైదరాబాద్‌: సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తరచూ కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటూ విమర్శలు చేశాడు. తీరా అధికారంలోకి వచ్చాక రేవంత్ అన్న, తమ్ముడికి ఎలాంటి అధికార హోదా లేకున్నా.. అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరేడుసార్లు ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. కేటీఆర్‌ కూడా తెలంగాణ ఉద్యమకాలం నుంచీ ప్రజా ప్రతినిధిగా ప్రజలచేత ఎన్నుకోబడుతున్నారు. కేసీఆర్‌ కుమార్తె కవిత ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు.

Also Read.. నిద్రిస్తున్న ఈ 7 ప్రాణులను పొరపాటున కూడా లేపకండి..లేపితే మీరు ప్రమాదంలో పడతారు..!!

మరీ, సీఎం రేవంత్‌రెడ్డి త మ్ముడు కొండల్‌రెడ్డి ఏ అధికారంతో కాన్వాయ్‌ ని ఉపయోగిస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డిలో ఈ నెల 14న కాం గ్రెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన అధికార లాంఛనాలతో ఇలా తరలివచ్చి హల్చర్ చేశాడు. ఆయనకు పోలీస్‌ కాన్వాయ్‌తోపాటు 2+2 గన్‌మెన్‌ భద్రతను ప్రభుత్వం కేటాయించినట్టు తెలిసింది.   వికారాబాద్‌ ఎ మ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన మంగళవారం వికారాబాద్‌ జిల్లా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక సమావేశంలోరేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి పాల్గొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

Also Read.. సమోసా కూడా ఇవ్వలేదు..టీ, బిస్కెట్లతో పోమన్నారు.. INDIAకూటమి మీటింగ్ పై JDU ఫైర్..!!

రేవంత్‌రెడ్డి సోదరులు ఎ మ్మెల్యేలు కాదు. ఎంపీలు కాదు.. ఏ రకమైన ప్రజాప్రతినిధులు కూడా కాదు. కానీ, అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం వా రికి భారీ పోలీస్‌ కాన్వాయ్‌ కేటాయించింది. భారీ భద్రత ఏర్పాటు చేసింది. రేవంత్‌రెడ్డి ఇన్నాళ్లూ కేసీఆర్‌ది కుటుంబ పాలన అని విమర్శించారు. మరి ఏ హోదా లేని ఆయన సోదరులు అధికారిక సమావేశాల్లో ఎలా పాల్గొంటున్నారు? దీన్నేమంటారు? దీనికి రేవంత్‌ ఏమంటారు? అని నెటిజన్లు ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌చేస్తూ ప్రశ్నిస్తున్నారు.

Latest News

More Articles