Sunday, May 12, 2024

రిషభ్‌ పంత్‌ను కాపాడిన డ్రైవర్‌కు రిపబ్లిక్‌డే రోజు సత్కారం

spot_img

రోడ్డు ప్రమాదంలో గాయపడి కారులో చిక్కుకుపోయిన పంత్‌ను కాపాడిన డ్రైవర్‌, కండక్టర్‌ను సత్కరిస్తామని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ సీఎంపుష్కర్‌ సింగ్‌ ధామి స్వయంగా ప్రకటించారు. రిషభ్‌ పంత్‌ ప్రాణాలు కాపాడిన డ్రైవర్‌ను హర్యానా రోడ్‌వేస్‌ ఆపరేటర్‌ను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం జనవరి 26న సన్మానించనుంది.

డిసెంబర్‌ 30వ తేదీ తెల్లవారుజామున భారత క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ దిల్లీ నుంచి కారులో రూర్కీకి వెళ్తుండగా నార్సన్‌ సరిహద్దుల్లో ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న హర్యానా రోడ్‌వేస్‌ బస్సు డ్రైవర్‌ సుశీల్‌ కుమార్‌, కండక్టర్‌ పరమ్‌జీత్‌ వెంటనే కారు దగ్గరకు వెళ్లి పంత్‌ను దాని నుంచి బయటకు తీసుకొచ్చారు. అతడు బయటపడిన 5-7 సెకన్లలోపే కారు మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుపోయింది. ఈ సాహసం చేరి వారిద్దరినీ హరియాణ ప్రభుత్వం అభినందించింది. తాజాగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా రిపబ్లిక్‌ డే రోజు వారిని సత్కరించనున్నట్లు ప్రకటించింది.

మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పంత్‌ను పరామర్శించడానికి వెళ్లొద్దని.. అతడికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు పెరుగుతాయని ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ సూచించారు.

Latest News

More Articles