Saturday, May 18, 2024

కేజ్రీవాల్ విచారణ.. ఢిల్లీలో హైటెన్షన్..!

spot_img

కేజ్రీవాల్ ఈడి విచారణ హాజరుపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవ్వాళ విచారణకు హాజరుకావలంటూ కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. గతంలో 4 సార్లు ఈడీ నోటీసులు ఇవ్వగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ విచారణకు హాజరుకాలేదు. ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రోగ్రాం ఉన్నందున విచారణకు హాజరుకాలేనంటూ ఈడీకి తెలిపారు కేజ్రీవాల్. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.

అయితే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నించేందుకు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు ఈడి అధికారులు. ఇప్పటికే నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 18 న ఈడీ విచారణకు కేజ్రీవాల్ రాలేదు. రాజకీయ కారణాలతో నోటీసులు ఇస్తున్నారని, నోటీసులు చట్ట విరుద్ధమని వాటిని ఉపసంహరించుకోవాలని ఈడీకి లేఖలు కూడా రాశారు కేజ్రీవాల్. లోక్ సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకోవడంలో భాగంగానే ఈడీ అరెస్ట్ చేసే కుట్ర చేస్తుందంటూ ఆప్ నేతల ఆరోపణలు చేస్తున్నారు.

Latest News

More Articles