Sunday, May 19, 2024

పిల్లి పేరు మీద రూ.800 కోట్ల ఆస్తి..

spot_img

చాలామంది తమ ఆస్తిని కొడుకు లేదా కూతురు పేరు మీద రాస్తుంటారు. మరికొంత మంది కొంత భాగాన్ని ట్రస్టులకు రాస్తుంటారు. కానీ పాప్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌ మాత్రం తన ఆస్తిలో కొంత భాగాన్ని తన పెంపుడు పిల్లి ఒలివియా బెన్సన్ పేరు మీద రాసింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన పెంపుడు జంతువుల్లో ఇది మూడోస్థానంలో ఉన్నది. ఈ పిల్లి ఆస్తి అక్షరాలా రూ.800 కోట్లు. తన యజమానితో పాటు పలు మ్యూజిక్‌ వీడియోల్లో కనిపించిన బెన్‌సన్‌.. బిగ్‌బడ్జెట్‌ యాడ్‌లలోనూ దర్శనమిచ్చింది.

కాగా.. 100 మిలియన్‌ డాలర్ల ఆస్తితో నాలా క్యాట్‌ అనే పిల్లి రెండో స్థానంలో ఉండగా, 500 మిలియన్‌ డాలర్ల సంపదతో ఓ శునకం మొదటిస్థానంలో ఉన్నది.

Latest News

More Articles