Friday, May 17, 2024

ధాన్యం కొనుగోళ్లలో మరోసారి సత్తాచాటిన తెలంగాణ సర్కారు

spot_img

సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అన్నపూర్ణగా మారింది. పంట పెట్టుబడి, 24 గంటల ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు అందిస్తుండడంతో రాష్ట్రంలో సిరులపంట పండుతున్నది. వరి కొనబోనని కేంద్రం మొండికేసినా..తానున్నాని కేసీఆర్‌ అభయం ఇవ్వడంతో అన్నదాతలు భారీగా వరిసాగు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ సర్కారు రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఇప్పటివరకు 62 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా, దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచినట్టు ఎఫ్‌సీఐ నివేదికలో వెల్లడైంది. గత ఏడాది వానకాలంలోనూ రికార్డు స్థాయిలో 70.22 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.

కాగా.. 181 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుతో పంజాబ్‌ మొదటి స్థానంలో నిలిచింది. 59 లక్షల టన్నులతో హర్యానా మూడు, 50 లక్షల టన్నులతో ఛత్తీస్‌గఢ్‌ నాలుగు , 23 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్‌ ఐదో స్థానంలో నిలిచాయి.

Latest News

More Articles