Saturday, May 18, 2024

కాంగ్రెస్, బిజెపి పార్టీలతో తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదు

spot_img

జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ లో సిఎంఅర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. 50 మంది లబ్దిదారులకు రూ.20 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలతో తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణపై వివక్షను చూపుతున్నదని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలలో ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ కు అదనంగా ఒక రూపాయి కూడా ఆర్థిక సహాయం అందించలేదన్నారు.‘కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం దాచుకోవడం లాంటి పనులే చేశారని ధ్వజమెత్తారు.

‘‘దశాబ్ది ఉత్సవాలలో 21 రోజులు అందరూ పాల్గొనాలి. జూన్ 2, 2014 లో తెలంగాణ ప్రజల కల సాకారమైంది.  9 ఏండ్లలో తెలంగాణ భ్రమ్మండమైన అభివృద్ధి సాధించింది. దేశంలోనే సంక్షేమ రంగానికి పెద్ద పీటవేసిన ప్రభుత్వం తెలంగాణ.  63 లక్షల రైతులకు 73 కోట్ల రూపాయల రైతు బందు ద్వారా పెట్టుబడి అందించాం. లక్ష లోపు రైతుల పంట రుణాలను రెండు సార్లు మాపి చేసిన ఘనత కేసీఆరే దే.

3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పంట దిగుబడి ద్వారా సాధించాం.  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోదావరి జలాలు పెరిగడంతో , భూగర్భజలాలు పెరిగాయి.  40 లక్షల ఆసరా పెన్షన్లకు 12 వేల కోట్ల రూపాయలు ఏడాదికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.  కాంగ్రెస్, బిజెపి పార్టీలు తెలంగాణకు ఉపయోగపడేవి కాదు.’’ అని అన్నారు.

Latest News

More Articles