Monday, May 20, 2024

వంద శాతం ఇంటింటికి మంచినీరు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ..!

spot_img

వంద శాతం ఇంటింటికి మంచినీరు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. 80% రక్షిత మంచి నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ఈనెల 2 నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఆదివారం మహబూబ్నగర్ జిల్లా మహబూబ్ నగర్ గ్రామీణ మండలం మన్యంకొండలో మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహించిన “మంచినీళ్ల పండగ “కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘గతంలో తాగునీటి కోసం మహిళ కిలోమీటర్ల దూరం నడిచి బిందె మీద బిందె పెట్టుకుని తెచ్చుకున్న పరిస్థితులు ఉండేవని ,అప్పుడు నీటిని ఏ విధంగా నీటిని వినియోగించుకున్నామో ఇప్పుడు అదే విధంగా వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి గుర్తుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను చేసుకుంటున్నామని, ముఖ్యంగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చిఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రవేశపెట్టారని, ఇది ఏ రాష్ట్రంలో లేదని, ఇది దేశం యావత్తు ప్రశంసిస్తున్న పథకం’ అని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Latest News

More Articles