Sunday, May 19, 2024

బస్ భవన్‭లో బాజిరెడ్డికి ఘన వీడ్కోలు

spot_img

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా పదవీ కాలం పూర్తయిన సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్ కి సంస్థ ఉన్నతాధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. బాజిరెడ్డి గోవర్దన్-వినోద దంపతులను ఘనంగా సన్మానించారు. చైర్మన్ గా రెండేళ్ల తన పదవీ కాలంలో ఆయన సంస్థకు చేసిన సేవలను కొనియాడారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బాజిరెడ్డి గోవర్దన్ గారికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని మంగళవారం టీఎస్ఆర్టీసీ నిర్వహించింది.ఈ కార్యక్రమంలో సంస్థ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. రెండేళ్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన కాలం జీవితంలో మరిచిపోలేనని చెప్పారు.

చిన్నతనం నుంచే ఆర్టీసీతో తనకు అనుబంధముందన్నారు. తాను, ఎండీ సజ్జనర్ 18 రోజుల వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించామని, ఆ సమయంలో ఎన్నో సవాళ్లు తమకు స్వాగతం పలికాయని గుర్తు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. సంస్థ బాగుండాలని, 45 వేల ఉద్యోగులకు భరోసా కల్పించాలని అనునిత్యం తపించామని చెప్పారు. తన పదవీ కాలంలోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషితోనే సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని చెప్పారు. తన విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తో పాటు అధికారులు, ఉద్యోగులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest News

More Articles