Sunday, June 2, 2024

తెలంగాణ అంతటా.. సీఎం కేసీఆర్ కు దన్యవాద సభలు

spot_img

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్ అంబెడ్కర్ పేరు పెట్టడం, దేశంలో మొట్టమొదటి సారిగా అతిపెద్ద అంబెడ్కర్ విగ్రహాం పెట్టడం, అమరజ్యోతి ఏర్పాటు చేయడంపై సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభలు పెట్టాలని చెప్పారు ప్రజా సంఘాల జేఏసీ చైర్మైన్ గజ్జెల కాంతం. ఈ సందర్భంగా గజ్జెల కాంతం మాట్లాడుతూ.. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ కు దాన్యవాద సభలు ఏర్పాటు చేయాలి. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చేముందు యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పటివరకు 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.

ఇక బండి సంజయ్ కి చట్టాల మీద రాజ్యాంగం మీద ఎలాంటి అవగాహన లేదు. నల్లధనం తెచ్చి 15 లక్షలు ఇస్తామని అన్నారు అవి ఎక్కడ. కేంద్ర హోంమంత్రి అమిత్ శా, నరేంద్రమోదీ వల్ల నిత్వావసర ధరలు పెంచారు. సిలిండర్ ధర,గ్యాస్ ధర ,పెట్రోల్ ధరలు పెంచారు. సీఎం కేసీఆర్ 125 అడుగుల అంబెడ్కర్ పెరు పెట్టడం సచివాలయనికి అంబెడ్కర్ పెరు పెట్టడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదు. దళితులు,బిసిలు,మైనార్టీలు బాగుపడటం బిజెపికి ఇష్టం లేదు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో స్కిం లు పెట్టి వారిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నరు సీఎం కేసీఆర్. అసలైన అంబెడ్కర్ వారసుడు సీఎం కేసీఆర్ అలాంటి నాయకుని దేశానికి ప్రధానిగా చూడాలి అన్నారు ప్రజా సంఘాల జేఏసీ చైర్మైన్ గజ్జెల కాంతం.

Latest News

More Articles