Friday, May 3, 2024

ఇంటి పనిని భార్యాభర్తలిద్దరూ పంచుకోవాల్సిందే..

spot_img

ముంబై: ఈ ఆధునిక సమాజంలో భార్యాభర్తలిద్దరూ సమానమేనని బాంబే హైకోర్టు అభిప్రాయపడ్డది. ముఖ్యంగా ఇంటి బాధ్యతలను, పనులను సమానంగా పంచుకోవాల్సిందేనని తన తీర్పులో స్పష్టం చేసింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్న క్రమంలో భార్య మాత్రమే ఇంటిపని చేయాలంటూ ఒత్తిడి చేయడం అతని బూజుపట్టిన భావ వైఖరిని తెలియజేస్తున్నదని కోర్టు అభిప్రాయపడింది.

Also Read.. రంగం ఏదైనా.. అవార్డులు సాధించటంలో తెలంగాణది అగ్రస్థానం..!!

ఆధునిక సమాజంలో ఇంటి బాధ్యతలు, పనులు దంపతులిద్దరిపైనా సమానంగా ఉందన్నారు. ఒక మహిళ పెళ్లయ్యి వచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులను కలుసుకోకుండా నిరోధించడం తగదన్నారు. వివాహమైనంత మాత్రాన ఆమె తన తల్లిదండ్రులతో బంధం తెంచుకోవాలని ఆశించడం సబబు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ పిటిషనర్‌ వేసిన కేసును కొట్టివేసింది.

Latest News

More Articles