Saturday, May 18, 2024

ఫార్ములా-ఈ  రేస్ పై నీలినీడలు!

spot_img

హైదరాబాద్: హైదరాబాదులో జరగాల్సిన ఇంటర్నేషనల్ ఈవెంట్ పై సందిగ్ధత నెలకొన్నది. ఫిబ్రవరి 10 న జరగాల్సిన ఫార్ములా-ఈ  రేస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అక్టోబర్ 30న  ఫార్ములా రేస్ నిర్వహణకు ఈ- ప్రిక్స్ తో గత తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే, ఒప్పంద వివరాలను కొత్త తెలంగాణ ప్రభుత్వం అడిగిందని, ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఫార్ములా-ఈ ప్రతినిధి తెలిపారు. కాగా, చర్చలు కొలిక్కిరాలేదని, దీంతో ప్రభుత్వం నుంచి గత ఒప్పందం ప్రకారం రేస్ నిర్వహణపై క్లారిటీ కోరినట్లు తెలిపారు. రేస్ కు మరో ఐదు వారాలే ఉండటంతో ఏర్పాట్లపై ఫార్ములా-ఈ ప్రతినిధుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారీగా వాణిజ్య పెట్టుబడులు పెట్టామని వెల్లడించారు. త్వరగా ప్రభుత్వం క్లారిటీ ఇస్తేనే  రేస్ నిర్వహణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Latest News

More Articles