Tuesday, May 21, 2024

గృహలక్ష్మి పథకం దరఖాస్తుకు 3 రోజులే గడువు.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

spot_img

ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

అర్హులైన వారు అఫ్లికేషన్ ఫారంతో పాటు ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్‌, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, ఆహార భద్రతా కార్డు, బ్యాంకు అకౌంట్ జీరాక్స్ కాఫీలు జత చేయాల్సి ఉంటుంది. ఎమ్మార్వో, మున్సిపల్, కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని సీఎస్ ఆదేశించారు. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్లతో పాటు ఈ నెల 10 వరకు వచ్చే దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను 20వ తేదీ వరకు పూర్తిచేయాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రితో ఆమోదం పొందిన లబ్ధిదారులకు 25వ తేదీ నాటికి పథకం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Latest News

More Articles