Saturday, May 18, 2024

విమానం గాల్లో ఉండగా ఊడిపడ్డ డోర్

spot_img

అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్ ఊడి కిందపడింది. న్యూయార్క్‌ రాష్ట్రంలోని బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఓ చిన్న విమానం డోర్ గాల్లో నుంచి కిందకు పడిపోయింది.

డోర్ కోసం వెతికినా అది దొరకలేదని బఫెలో సిటీ శివారులోని చీక్టోవాగా సబ్‌అర్బన్ పోలీసులు తెలిపారు. విమానంలోని ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందన్నారు. డోర్ పడిన కారణంగా ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. నిన్న( సోమవారం)సాయంత్రం 5:30 గంటల సమయంలో డోర్ ఊడిపడిందని చెప్పారు. ఈ విమానం ఎయిర్‌పోర్టుకు దక్షిణ దిశలో కొన్ని మైళ్ల దూరం ప్రయాణించిందని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఫలించిన ఎమ్మెల్సీ కవిత చొరవ.. అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు

Latest News

More Articles