Sunday, July 7, 2024

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ షురూ.. రేపటి నుండి రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు

spot_img

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది. పోలీస్, రెవెన్యూ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేస్తుంది. గత రెండు రోజుల నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించింది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు సూచనలు చేస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుండి ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో రేపటి నుండి క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ తేదీ కంటే మూడు రోజుల ముందే పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులు, వికలాంగుల ఇంటికే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకువెళ్లి వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని సూచించారు.

Latest News

More Articles