Friday, May 17, 2024

66వేలకు చేరువలో బంగారం ధరలు..!

spot_img

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత వారం రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధర మరో చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకుంది. కమోటిడి ఫ్యూచర్ మార్కెట్లో రూ. 65వేలు దాటింది. శనివారం రూ. 66వేలకు చేరుకుంది. ప్రస్తుతం నెలలో ఇప్పటి వరకు బంగారం ధర రూ. 2,700పైగా పెరిగింది. అయితే వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పోవెల్ ప్రకటనతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రూ. 2,152 డాలర్లు పలికింది. అలాగే ఫ్యూచర్ మార్కెట్లో 2,158.50 డాలర్ల వద్ద ఉంది. అధిక ధరలతో బంగారం దుకాణాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి.

ఇది కూడా చదవండి: బీజేపీ హిందూ దేవుళ్ళ పేరుతో ఓట్ల రాజకీయం చేస్తోంది

Latest News

More Articles