Tuesday, May 21, 2024

నేడు రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ.. ఏ ప్రాంతాల వారికి ఎక్కడ ఇస్తారంటే..

spot_img

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జాతరలా సాగుతోంది. ఇప్పటికే మొదటి విడత ఇండ్ల పంపిణీ పూర్తి చేసిన ప్రభుత్వం.. నేడు రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. రెండో విడతలో ఎంపికైన లబ్దిదారులకు ఈ రోజు పలు ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయనున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సౌకర్యాలతో కూడిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. మొదటి విడతలో ఎంతో పారదర్శకంగా NIC రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి 11,700 మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఈ నెల 2న 8 ప్రాంతాలలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ఇండ్లను పంపిణీ చేశారు.

రెండో విడతలో అర్హులైన లబ్దిదారుల ఎంపిక కోసం ఈ నెల 15న కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి 13,200 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. డ్రాలో ఎంపికైన లబ్దిదారులకు నేడు 9 ప్రాంతాలలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇండ్లను పంపిణీ చేయనున్నారు.

ప్రాంతాల వారీగా పంపిణీ

1. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‎లో 2100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనున్నారు.

2. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మన్ సాన్ పల్లిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 700 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

3. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అట్టిగూడలో భూగర్బ గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి 432 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

4. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తట్టి అన్నారంలో హోంమంత్రి మహమూద్ అలీ 1268 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

5. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తిమ్మాయిగూడలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 600 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

6. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు 2లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు 4800 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

7. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ 3లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 1200 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

8. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 1000 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

9. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ 1100 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

Latest News

More Articles