Monday, May 20, 2024

Viral News : ఇదెక్కడి దారుణం..పుట్‎బాల్ కోసం విద్యార్థులకు రెండురోజులు భోజనం పెట్టలేదు..!!

spot_img

Chhattisgarh School : ఛత్తీస్‌గఢ్‌లోని ఓ పాఠశాలలో అత్యంత అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సూరజ్ పూర్ లోని ఓ పాఠశాలలో 45 మంది పిల్లలకు రెండు రోజులు భోజనం పెట్టలేదు. ఈ వింత శిక్ష ఇప్పుడు వివాదంగా మారింది. పిల్లలు చేసిన తప్పు ఏంటంటే..ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు..పొరపాటున ఆ బంతి చెడిపోయిది. ఇంత చిన్న విషయానికి పాఠశాలలో ఉన్న 45మంది విద్యార్థులకు రెండు రోజులుగా భోజనం పెట్టలేదు. ఈ విషయం వెలుగులోకి రావడంతో…ఈ శిక్షకు కారణమైన సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశారు అధికారులు. పిల్లలు కష్టం తెలుసుకోవాలనే ఇలాంటి శిక్ష వేశామని తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు సదరు సూపరింటెండెంట్‌.

ఇది కూడా చదవండి: పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెడుతున్నారో బీజేపీ చెప్పాలి

ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మిషనరీ బోర్డింగ్ స్కూల్ లో జరిగింది. చిన్నారులకు ఇంత శిక్ష విధించిన సూపరింటెండెంట్ ఫాదర్ పీటర్ సదమ్.. పిల్లలకు భోజనం పెట్టలేదని అధికారుల ముందు నిలదీశారు. రాయ్‌పూర్ నుండి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతాపూర్‌లో నిర్మించిన ఈ పాఠశాలలో 141 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే ఎక్కువ. 21 గదులు ఉన్న హాస్టల్లో మొత్తం 141మంది విద్యార్థులను ఉంచారు.

ఇది కూడా చదవండి: ‘గుడ్ బ్యాంకు, ఒక్క రూపాయి దొరకలేదు, నన్ను పట్టుకోవద్దు’ బ్యాంకులో దొంగోడి లేఖ

పిల్లలకు భోజనం పెట్టడం లేదన్న విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు పిల్లలకు బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఈ విధంగా బిస్కెట్లు పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆగస్టు 28న ఫుట్‌బాల్‌ ఆడుతుండగా చిన్నారులపై నుంచి బాల్ లో గాలిపోయి డ్యామేజ్ అయ్యింది. ఈ ఘటనతో పాఠశాల సూపరింటెండెంట్ పిల్లలకు ఈ క్రూరమైన శిక్ష విధించాడు.జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ బృందం పాఠశాలకు చేరుకోగా.. 45 మంది చిన్నారులు శిక్షకు గురైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పిల్లల కుటుంబాలు, స్థానికులు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ అధికారి తన విచారణను జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించగా, ఆరోపణలు నిజమని అంగీకరించారు. ఇప్పుడు పాఠశాల సూపరింటెండెంట్‌ను బిషప్ సస్పెండ్ చేశారు.

Latest News

More Articles