Saturday, May 4, 2024

తెలంగాణ విద్యాశాఖ ప్రతినెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు

spot_img

తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ప్రతీనెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు, స్కూలు పిల్లల పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు ‘నో బ్యాగ్‌ డే’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులపై ఒత్తిడి, బ్యాగుల భారం తగ్గించడంలో భాగంగా ప్రతి నాలుగో శనివారం నో బ్యాగ్‌ డేగా అమలు చేస్తామని తెలిపారు విద్యాశాఖ అధికారులు.

పాఠశాల విద్యా శాఖకు చెందిన స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ 1 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం 10 బ్యాగ్‌లెస్‌ రోజుల కోసం హ్యాండ్‌ అవుట్‌ తో ముందుకు వచ్చింది. ఇది ప్రతి నాలుగవ శనివారం చేపట్టాల్సిన కార్యక్రమాలను తెలిపింది. వీటిలో 28 రకాల కార్యకలాపాలు ఉన్నాయి, వాటిని వారి సామర్థ్యాన్ని బట్టి ఉపయోగించుకునే అవకాశం కల్పించింది.

Latest News

More Articles