Sunday, May 19, 2024

గృహజ్యోతి..నగరంలో 11లక్షల మందికే..భగ్గుమంటున్న జనం.!

spot_img

అధికార కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలపై జనం భగ్గుమంటున్నారు. ఎన్నికల హామీల్లో చెప్పింది ఒక్కటి..ఇప్పుడు చేస్తుంది ఒకటంటూ ఫైర్ అవుతున్నారు. గృహజ్యోతి స్కీంలో నగరంలో మొదట 11 లక్షల మందికే వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి వివరాలన్నింటినీ సీజీజీకి చేరాయి. మార్చినెలలో వీరికి మాత్రమే సున్నా బిల్లులు జారీ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ స్కీం ప్రారంభించనున్న నేపథ్యంలో నగర వాసులు మండిపడుతున్నారు. కేవలం కొంతమందికి మాత్రమే వర్తిస్తుందని చెప్పడం మోసపూరిత చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 55లక్షల మందికి మాత్రమే గృహజ్యోతి వర్తించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను బట్టి ఇది ఇంకా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. లేదంటే పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

గృహజ్యోతి పథకానికి అత్యధికంగా హబ్సిగూడ ఉన్నారు. ఇక్కడ 1.62లక్షల మంది ఇళ్లకు ఫ్రీ విద్యుత్ వర్తించే అవకాశం కనిపిస్తోంది. రాజేంద్ర నగర్ సర్కిల్లో 1.59లక్షలు, సరూర్ సర్కిల్ 1.47లక్షలు, హైదరాబాద్ సౌత్ లో 1.27 లక్షలు వివరాలు ఇవ్వగా …మిగతా సర్కిళ్లలో లక్షలోపే ఉన్నారు. ఈనెల 16 వరకు 10లక్షల మంది వివరాలను విద్యుత్తు సిబ్బంది సేకరించారు. ఈ పదిరోజుల్లో మరో లక్షదాకా మాత్రమే అదనంగా మ్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉన్న 19.85లక్షల దరఖాస్తుల్లో గృహజ్యోతి మ్యాపింగ్ ప్రక్రియ 11లక్షల వరకే జరిగింది. ఇంకా 8.85లక్షల దరఖాస్తు దారులు ఏమయ్యారన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇది కూడా చదవండి: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సలహాకు ఢిల్లీ పోలీసులు ఫిదా…వైరల్ అవుతోన్న వీడియో..!

Latest News

More Articles