Saturday, May 18, 2024

నేడు వైకుంఠ ఏకాదశి..ఉత్తర ద్వారా దర్శన రసహ్యం ఇదే..!!

spot_img

ఇవాళ వైకుంఠ ఏకాదశి..దీనిని మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఇవాళ మోక్షం లభిస్తుంది కాబట్టి అలా అంటారు. ఇది మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి. ఈరోజు చాలా మంది రోజు. విష్ణుఆలయాల్లో వైకుంఠధామంలో ఉన్న శ్రీరామన్నారాయణుడిని ఉత్తర ద్వారం నుంచి వెళ్లి భక్తులు దర్శించుకుంటారు.

వైష్ణవ గ్రంథాల ప్రకారం సంహితా గ్రంథాలు ప్రత్యేకమైనవి. వాటిలో శ్రీ ప్రశ్న సంహిత అనే గ్రంథంలో ముక్కోటి ఏకాదశి , వైకుంఠ ఏకాదశి నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం స్వామివారిని దర్శించుకోవడం ద్వారా మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అసలు ఉత్తరద్వారం నుంచి ఎందుకు దర్శించుకోవాలంటే పురాణాల ప్రకారం..మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులతో విష్ణువు యుద్ధం చేస్తారట. కానీ గెలవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీకు ఏం వరం కావాలో కోరుకోమని స్వామివారిని కోరుతారు. వారు గర్వంతో మాకు నువ్వు వరం ఇచ్చేదేంటి..మేమే నీకు ఇస్తాం కోరుకో అంటారు. దాంతో స్వామి వారిద్దర్నీ తన చేతిలో చనిపోవాల్సిందిగా వరం కోరుతారు. అందుకు ఆ రాక్షసులు ఒప్పుకోని మరణిస్తారు. అలా మాట నిలబెట్టుకున్నందుకు వారిని స్వామి..ఉత్తరద్వారం వైకుంఠధామంలోకి పంపిస్తారు. అలా లోపలికి వెళ్లినవారు మంచివారిగా మారుతారు. దీంతో తమకు కలిగిన భాగ్యాన్ని అందరికీ కల్పించాలని ఆ రాక్షసులు స్వామివారినికోరుతారు. అందుకు స్వామి అంగీకరిస్తారు.

ఉత్తర ద్వారం నుంచి విష్ణులోకానికి వెళ్లు మధుకైటభులు ఎలా అయితే మారిపోయారో అలా ఉత్తర ద్వారం ద్వారా ఇవాళ శ్రీమన్నారాయణుడిని దర్శించుకున్న వారికి కూడా ఇహలోకంలో సర్వసంపదలు, పరలోక మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే దీనికి కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ఇవాళ ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు. కోపంతో ఉండకూడదు. రోజంతా ఉపవాసం చేయవచ్చు. పాలు లేదా పండ్లు మాత్రమే తినవచ్చు. లేదంటే ఉడకబెట్టిన పదార్థాలు తినవచ్చు. పగలు ఉపవాసం ఉండి, రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినాలి. అయితే పిల్లలు, ముసలి వాళ్లకు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని పండితులు తెలిపారు.

ఇది కూడా చదవండి: రైతు బంధుపై ఫిర్యాదుల వెల్లువ…రైతు అకౌంట్లో 2 రూపాయలు జమ..!!’

Latest News

More Articles