Monday, May 20, 2024

ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఫ్యామిలీ టికెట్ల నిలిపివేత

spot_img

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీచేసిన ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 1, 2024 నుంచి ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇకపై ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లు జారీ చేయాలంటే కండక్టర్లు వారి గుర్తింపు కార్డులను చూడాలి. ప్రయాణికులు తమ వయస్సును నమోదు చేసుకోవాలి. మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరగడంతో కండక్టర్లు ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లు ఇచ్చేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు.

Latest News

More Articles