Friday, May 17, 2024

తిరుమల వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.. నేడు దర్శనం టికెట్లు విడుదల

spot_img

తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నేడే శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ నెలకు గాను ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి 22 వరకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ కోటా టికెట్లను టీటీడీ ఆదివారం విడుదల చేసింది.

ఆదివారం బ్రేక్‌, ప్రత్యేక దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. మంగళవారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు బయట క్యూలైన్‌లో వేచిఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శానికి 18 గంటల సమయం పడుతున్నది.

తిరుమల బ్రహ్మోత్సవాలలో ఏడోరోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి 7 గంటలకు శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంపై ఊరేగాడు.

ఎనిమిదొవ రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 7 నుండి 10 గంటల వరకు మలయప్ప స్వామి రథోత్సవంపై విహరించనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత రథోత్సవం వాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలుకుతున్నారు. గోవింద‌ నామ స్మరణలతో తిరుమలగిరులు మారుమోగుతున్నాయి. ఎనిమిదొవ రోజు రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనసేవపై మలయప్ప స్వామి విహరించనున్నారు.

Latest News

More Articles